ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49 లక్షలు

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49 లక్షలు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి హుండీల ద్వారా రూ. 49 లక్షల ఆదాయం  సమకూరింది. సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శివరాజు, ఇన్స్ పెక్టర్ రంగారావు, ఈవో మోహన్ రెడ్డి, చైర్మన్ బాలాగౌడ్ సమక్షంలో ఆలయంలోని 14 హుండీలను లెక్కించారు. బంగారం, వెండి మినహా71 రోజుల్లో నగదు రూపంలో రూ. 49,6854 వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ఈ డబ్బును దుర్గమ్మ ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ధర్మకర్తలు వెంకటేశం, మనోహర్, మోహన్ రావు, సాయిలు, సిద్దిరాములు, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మధుసూదన్  ఉన్నారు.