
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు.
అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలక మండలి, అధికారులు ఏర్పాట్లు చేశారు.