Eesha Rebba: ఆడిషన్ కి వెళితే నల్లగా ఉన్నావంటూ అవమానించారు... ఆ హీరో ఏకంగా...

Eesha Rebba: ఆడిషన్ కి వెళితే నల్లగా ఉన్నావంటూ అవమానించారు... ఆ హీరో ఏకంగా...

తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి క్లిక్ అయిన కొద్దిమంది హీరోయిన్లలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా రెబ్బ ఒకరు. ఈషా రెబ్బ 2013లో ప్రముఖ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన "అంతకుముందు ఆ తర్వాత" అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కించుకోలేక పోయింది. అయితే నటి ఈషా రెబ్బ తాను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి స్పందించింది.

ఇందులో తనకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకునే విషయంలో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. అలాగే తన స్కిన్ టోన్ కొంతమేర నల్లగా ఉండటంతో ఆడిషన్స్ లో ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ నల్లగా ఉన్నావంటూ అవమానించేవారని ఎమోషనల్ అయ్యింది. మరికొందరైతే తాను హీరోయిన్ గ పనికిరానని అంటూ మనసు నొచ్చుకునే విధంగా సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళని తెలిపింది. అయినప్పటికీ తాను ఇలాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చింది. 

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలని పెద్దగా ఎంకరేజ్ చెయ్యరని, కానీ హిందీ, మలయాళం, తమిళ్ భషాలకి చెందిన అమ్మాయిలని మాత్రం బాగా ప్రోత్సహిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే తనతోపాటు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మలయాళ హీరో తాను ఒక సినిమా చేసేలోపే 6 సినిమాలు కంప్లీట్ చేశాడని అక్కడివాళ్లు అంతగా ఎంకరేజ్ చేస్తారని.. కానీ ఇక్కడ మాత్రం అంతా డిఫరెంట్ గా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ALSO READ : భీమవరం విష్ణు కాలేజీలో సందడి చేసిన జాక్ మూవీ టీమ్

ఈ విషయం ఇలా ఉండగా నటి ఈషా రెబ్బ సినిమాల్లో మాత్రమే కాదు వెబ్ సీరీస్ లలో కూడా నటించింది. ఈ క్రమంలో ఈషా నటించిన 3 రోజెస్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా అనౌన్స్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eesha Rebba (@yourseesha)