తెలంగాణ మహిళా ఎంట్రప్రెన్యూర్​తో...ఈఈఎస్​ఎల్​ భాగస్వామ్యం

తెలంగాణ మహిళా ఎంట్రప్రెన్యూర్​తో...ఈఈఎస్​ఎల్​ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌‌‌‌ఎల్) తెలంగాణకు చెందిన పద్మ వద్త్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య పరిష్కారాలను విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పద్మ వద్త్యా అనే సంస్థ యజమాని అయిన పద్మ, కంపెనీకి రిటైల్ ఫ్రాంచైజీల స్థాపన కోసం భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు.  ఈ ఒప్పందం రిటైల్ ఫ్రాంచైజీలను స్థాపించడం,  తెలంగాణ వాసులకు ఇంధనాన్ని పొదుపు చేసే టెక్నాలజీని మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఈఈఎస్​ఎల్ లైటింగ్, యాక్సెసరీలను అమ్ముతోంది.