వరంగల్ : కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టంగా మారిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వ పరిస్థితి ఆరిపోయే దీపంలా మారిందని అన్నారు. 2023 వరకు కేసీఆర్ సర్కారు ఉండకపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంనది అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్కు హుజూరాబాద్లో ఎదురైన పరిస్థితి తెలంగాణ అంతటా పునరావృతమవుతుందని ఈటల జోస్యం చెప్పారు. రాజకీయ నాయకులతో పాటు మీడియాపై కేసీఆర్ జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత అణిచివేయాలని ప్రయత్నిస్తే అంతగా నిరసనలు ఎగిసిపడతాయని హెచ్చరించారు.
For more news..