దానా తుఫాను ఎఫెక్ట్ కారణంగా ఏపీలో రెండ్రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో దానా కేంద్రీకృతమై ఉందని.. ఎల్లుండి( అక్టోబర్ 25)న పూరీ సాగర్ ద్వీపం మధ్య ఒడిశా సమీపంలో తీవ్ర తుఫానుగా తీరంగా దాటే అవకాశం ఉందని హెచ్చరించింది.
దానా తుఫాను గంటలకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని వెల్లడించింది. పారాదీప్ కు 460 కిమీ , ధమ్రాకు 490 కి.మీ , సాగర్ ద్వీపానికి 540 కిమీ దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.
ALSO READ | ఏపీకి మరో తుఫాను హెచ్చరిక : వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
దనా తుఫాను కారణంగా రేపు గురువారం అక్టోబర్ 24) న ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశంఉందని హెచ్చరించింది.
రెండ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 80-100కిమీ వేగంతో వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన ఈదురుగాలుల ప్రభావం నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.