ఫుడ్ ​పాయిజన్​ ఎఫెక్ట్.. వాంకిడి గురుకులానికి పిల్లలొస్తలే!

 ఫుడ్ ​పాయిజన్​ ఎఫెక్ట్.. వాంకిడి గురుకులానికి పిల్లలొస్తలే!
  • రోజురోజుకు తగ్గుతున్న హాజరు
  • దీపావళి తర్వాత హాస్టళ్లకు రాని విద్యార్థులు
  • 590 మందికి కేవలం 105 మంది మాత్రమే
  • పోలీసుల పహారా మధ్య స్టూడెంట్లు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్​ పాయిజన్​ ఎఫెక్ట్​ స్టూడెంట్లలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఘటన తర్వాత భయపడిపోయిన తల్లిదండ్రులు చాలా మంది తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజన్ ఘటన తెలుసుకున్న తర్వాత దీపావళి సెలవులకు ఇండ్లకు వెళ్లిన వారిలో చాలా మంది హాస్టల్​కు తిరిగి రావడంలేదు. దీంతో స్కూల్​లో మొత్తం 590 స్టూడెంట్లు ఉండగా.. ప్రస్తుతం 102 మంది మాత్రమే ఉన్నారు. 

హాస్టల్​ వద్ద పోలీసు బందోబస్తు

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్​పాయిజన్ ​ఘటన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని పిల్లల పేరెంట్స్, ఆదివాసీ సంఘాలు, తుడుం దెబ్బ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. వారు ఆందోళన చేస్తారన్న ముందస్తు సమాచారంతో అధికారులు హాస్టల్​లో గురువారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హస్టల్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. హాస్టల్​లోని తల్లిదండ్రులను గానీ, ఇతరులను అనుమతించడంలేదు.

ఆశ్రమ స్కూళ్లలో పడిపోతున్న హాజరు

జైనూర్ మండలంలోని పోచంలొద్ది ట్రైబల్​ వెల్ఫేర్​ఆశ్రమ స్కూల్​లో మొత్తం 270 మంది స్టూడెంట్లకు గానూ 150 మంది మాత్రమే ఉన్నారు. మర్లవాయిలో 256 మందికి గానూ 132 మంది, తిర్యాణి మండల కేంద్రంలోని స్కూల్​లో 244 మంది స్టూడెంట్లకు గాను 160 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆశ్రమ పాఠశాలల్లో హాజరు శాతం పడిపోతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని హాస్టళ్లలో 100 కు పైగానే విద్యార్థులు గైర్హాజరు అవుతున్నా ఐటీడీఏ పీవో గానీ, కలెక్టర్ పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి. 

ఆర్డర్స్ వల్లే..

ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు గురువారం కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ బాయ్స్​ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లారు. కానీ హెచ్ఎం అశోక్ కుమార్ హాస్టల్ లోపలికి ఎవరినీ అనుమతించలేదు. కేవలం ఆఫీస్ రూమ్ వరకు మాత్రమే రానిస్తమని, స్టూడెంట్స్ దగ్గరకు వెళ్లనివ్వకూడదని ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ స్కూల్ లో 171 మంది స్టూడెంట్స్ ఉండగ ప్రస్తుతం 124మంది ఉన్నట్లు వార్డెన్ శ్యామ్ రావు తెలిపారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నామని, సరుకులు వచ్చిన ప్రకారం ఫుడ్ పెడుతున్నట్లు చెప్పారు.