లోక్ సభ ఎన్నికలు: సర్కారు ఉద్యోగులు ఎటువైపు!

లోక్ సభ ఎన్నికలు: సర్కారు ఉద్యోగులు ఎటువైపు!

లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొచ్చేసింది. ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉంటుం దన్నదానిపై అందరి దృష్టి పడింది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరికి మద్దతిచ్చే అవకాశం ఉందన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి టీచర్స్, గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలవడం, తమ సమస్యలు పెండింగ్ లో ఉండటంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి దీనికి కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రం లో సుమారు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.వారు, వారి కుటుం బ సభ్యులు కలిపి సుమారు 20 లక్షల ఓట్లు ఉంటాయని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఓట్లు ప్రతి లోక్ సభ సెగ్మెంట్ లోనూ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికలతో…

లోక్ సభ ఎన్ని కలకు 12 రోజుల ముందు వెల్లడైన టీచర్స్, గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార పార్టీ మద్దతుదారులు ఓటమి పాలవడంపై చర్చ జరుగుతోంది. నల్గోండ– ఖమ్మం–వరంగల్ సెగ్మెంట్ లో అధికార పార్టీ మద్దతుదారు రెండో స్థా నంలో నిలవగా, కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ సీటులో నాలుగో స్థా నంలో నిలిచి పరాజయం పాలయ్యారు. గ్రాడ్యుయేట్స్​సెగ్మెంట్ ఎన్ని కలో కాంగ్రెస్ అభ్యర్థి గెలి చారు. ఇందులో టీచర్స్​ సెగ్మెంట్ల ఫలితాలు కీలకంగా మారాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉద్యోగులైన టీచర్లు అధికార పార్టీ మద్దతుదారులకు ఓటేయకపోవడంతో.. లోక్ సభ ఎలక్షన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతుందా, లేక గులాబీ పార్టీ వైపు నిలుస్తారా అన్న చర్చలు జరుగుతున్నాయి.

పీఆర్సీయే కీలకం…

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు చాలానే పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ముఖ్యం గా వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు, మధ్యం తర భృతి (డీఏ),హెల్త్ కార్డులు, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావటం వంటివి అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిల్లో పీఆర్సీ అంశంకీ లకమైనది. రాష్ట్రంలో 2018 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది.2014లో 44 శాతం ఇచ్చిన నేపథ్యం లో ఈసారి 63 శాతం ఇవ్వాలని కమిటీకి ఇచ్చిన వినతిపత్రాల్లో ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ప్రభుత్వం 35 శాతంలోపే ఫిట్ మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచిగానీ, పీఆర్సీ కమిటీ నుంచిగానీ పెద్దగా సమాచారమేదీ లేదు. ఒక్కో శాతం ఫిట్ మెంట్ కు రూ.300 కోట్లు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన 30 – 35 శాతం పీఆర్సీ ఇస్తే.. సుమారు రూ.9,000 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల వరకు అవసరమని లెక్కిస్తు న్నారు. పీఆర్సీకి సంబంధించి కమిటీ మాత్రం ఇంతవరకు ప్రభుత్వానికి నివేదిక అందజేయలేదు.

ఇతర డిమాండ్లపై కూడా…

పాత పీఆర్సీ గడువు ముగిసి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. మధ్యం తర భృతి అయిన ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఉద్యోగులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ఇచ్చే డీఏ ప్రకటనలో జాప్యం చేయడం ఏమిటని పేర్కొంటు న్నారు. ఇక పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ఎన్ని కల ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. దానికి సంబంధిం చి ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన డిసెంబర్ నుంచి ప్రతి నెలా 500 మందికిపైగా రిటైర్ అవుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సంఖ్య మరింత ఎక్కు వగా ఉండే అవకాశముందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో రిటైర్మెం ట్ వయసు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 అసెంబ్లీ లో పల్లె ఓటర్ల నుంచే భారీ ఓట్లు…

ఇటీవలి అసెంబ్లీ ఎన్ని కల్లో పల్లె ఓటర్ల మద్దతుతోనే అధికార పార్టీ అత్యధికంగా ఓట్లు , సీట్లు సాధించిందని రాజకీయ విశ్లేష కులు అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో జనం, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఓట్లు పోలరైజ్ కాలేదని.. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీల ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనమని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలపై ఎమ్మె ల్సీ ఫలితాల ఎఫెక్ట్​ కచ్చితంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.