ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో చేపలు చనిపోయాయి. టెంపరేచర్లు 46 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో వాటికి ఆక్సిజన్ అందడం లేదు.
జిల్లాలో 440 చెరువులతోపాటు మిడ్‌మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులున్నాయి. గత వర్షాకాలంలో వీటిల్లో సుమారు 1.40 కోట్ల చేపపిల్లలను వదిలారు. దీనిపై ఆధారపడి సుమారు 8వేల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో గతేడాది 6 వేల టన్నుల దిగుబడి రాగా.. ఈసారి ఎండల ఎఫెక్ట్‌తో దిగుబడి తగ్గే అవకాశముందని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.
- రాజన్నసిరిసిల్ల, వెలుగు