బీజేపీ దిష్టిబొమ్మల దహనం

బీజేపీ దిష్టిబొమ్మల దహనం

గోదావరిఖని, వెలుగు: ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌‌‌‌గాంధీని చంపుతామంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసనలు గురువారం చేపట్టారు. గోదావరిఖనిలో రాజీవ్​ రహదారిపై ఆ పార్టీ పట్టణ లీడర్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మేయర్​ అనిల్​ కుమార్​, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్​, మహాంకాళి స్వామి, లింగస్వామి, ఎం.రవికుమార్​, ఎల్లయ్య, రాజిరెడ్డి, దీటి బాలరాజు, రాజేశ్​, ప్రకాశ్​, పాల్గొన్నారు.


హుజూరాబాద్‌‌‌‌లో పోలీసులకు ఫిర్యాదు 


హుజూరాబాద్, వెలుగు:  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ లీడర్లపై హుజూరాబాద్ పీఎస్‌‌‌‌లో కాంగ్రెస్ మహిళా విభాగం, మస్లిం మైనారిటీ  నాయకులు గురువారం ఫిర్యాదు చేసారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఎం నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్ తదితర నాయకులపై   కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, తిరుపతి, పుష్పలత, లావణ్య, అఫ్సర్, తదితరులు ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని పాత బస్టాండ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, లీడర్లు షేక్ గౌస్, బాల్ రెడ్డి, రాజేందర్, చెన్ని బాబు, కార్తిక్ గౌడ్, మండే శ్రీను  తదితరులు పాల్గొన్నారు.