నిజామాబాద్‌అర్బన్, వెలుగు: నిజామాబాద్‌లోని ఐటీ హబ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఐటీ హబ్‌ను గురువారం సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తున్న వివిధ కంపెనీలకు చెందిన సిబ్బందితో మాట్లాడారు.
గత ప్రభుత్వం నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, కంపెనీలను తేవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హబ్‌లో 671 మందికి సీటింగ్ కెపాసిటీ ఉన్నా ఇప్పటి వరకు కేవలం 313 మంది మాత్రమే ఉన్నారన్నారు. త్వరలోనే ఐటీ మంత్రితో మాట్లాడి ఐటీ హబ్‌కు మంచి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి, యువతకు ఉపాధి అందేలా కృషి చేస్తానన్నారు.