బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్‌విండో చైర్మన్లు కోరారు. శనివారం సాలూరా, పిట్లం మండలం చిన్నకోడబ్గల్, నవీపేట్ మండలం బినోల, భిక్కనూరు అంతంపల్లి సొసైటీల్లో మహాజన సభలు నిర్వహించారు.
ఏడాదిలో జరిగిన ఖర్చులు, ఆదాయాల వివరాల వెల్లడించారు. సాలురా సొసైటీ చైర్మన్ అల్లె జనార్ధన్ మాట్లాడుతూ.. బ్యాంక్‌లోన్ ద్వారా 250 మెట్రిక్ టన్నుల గోదాం, దుకాణాల సముదాయం నిర్మాణాలకు సంఘం సభ్యులు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.చిన్నకొడప్గల్ సొసైటీ చైర్మన్నారాయణరెడ్డి మాట్లాడుతూ..రుణమాఫీ అయిన రైతులందరికీ కొత్త అప్పులు ఇవ్వాలని కోరారు. సంఘం పరిధిలోని కాటేపల్లిలో కొత్త ఆఫీసు నిర్మించాలని ఆ గ్రామ రైతులు కోరారు.