కులవివక్ష నిర్మూలనకు పూలే ఎనలేని కృషి

  • బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ చైర్మన్ వకులాభరణం నివాళి 

హైదరాబాద్, వెలుగు:  మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు ఎంతో కృషి చేశారని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. మహిళలకు, అణగారిన కులాల ప్రజలకు విద్యను  అందించడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పదన్నారు. పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురు వారం ఖైరతాబాద్​లోని బీసీ కమిషన్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి చైర్మన్ నిరంజన్, మెంబర్లు తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, సమాజం పటిష్టంగా ఉండాలంటే ప్రతి వ్యక్తికి విద్య ప్రాథమిక హక్కుగా ఉండాలని పోరాడిన సమసమాజ దార్శనికుడు పూలే అని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. గురువారం అంబర్ పేట అలీ కేఫ్ చౌరస్తా వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.