ఎన్సీఎస్ఎఫ్​ పున:ప్రారంభానికి కృషి : భూపతిరెడ్డి

ఎన్సీఎస్ఎఫ్​ పున:ప్రారంభానికి కృషి : భూపతిరెడ్డి

నిజామాబాద్​ అర్బన్, వెలుగు: సిటీ శివారులోని సారంగాపూర్​లో ఉన్న ఎన్సీఎస్సీఎఫ్ ​పున:ప్రారంభించడానికి కృషి చేస్తానని రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హన్మంతుతో కలిసి బుధవారం ఫ్యాక్టరీని పరిశీలించిన ఆయన, పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, సిబ్బంది, చెరుకు రైతులతో సమావేశమయ్యారు.

బీఆర్ఎస్​ హయాంలో మూతపడ్డ షుగర్​ ఫ్యాక్టరీల తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో సీఎం, ఇతర మంత్రులకు ఎన్సీఎస్ఎఫ్​ అంశాన్ని వివరించగా, వారు సమగ్ర వివరాలు కోరారని, అందుకే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలు, యంత్రాల పరిస్థితి, అప్పులు, అవసరమైన నిధులు, సిబ్బంది తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ చైర్మన్​సాయిరెడ్డి, ప్రతినిధులు గంగారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.