మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

నస్పూర్, వెలుగు: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పెడింగ్ వేతనాలతోపాటు కార్మికులకు రావాల్సిన ఈపీఎఫ్ డబ్బులు చెల్లించాలని, పేర్లను ఆన్​లైన్ లో ఎక్కించాలనే డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం ఎమ్మెల్యే సందర్శించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు దీక్ష విరమించారు..