ఐఎన్‌‌‌‌టీయూసీ బలోపేతానికి కృషి : వేముల వీరేశం 

నార్కట్​పల్లి, వెలుగు: కాంగ్రెస్ కార్మిక విభాగమైన ఐఎన్‌‌‌‌టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు.  ఆదివారం నార్కట్ పల్లిలో ఐఎన్‌‌‌‌టీయూసీ, ఎస్‌‌‌‌డబ్ల్యూయూ, ఆర్టీసీ  రీజియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నార్కట్ పల్లి డిపో పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఐఎన్‌‌‌‌టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమ్మద్ మాట్లాడుతూ.. ఐఎన్‌‌‌‌టీయూసీకి ఆర్టీసీలో  మంచి గుర్తింపు పొందిందని, దానికి అనుబంధమైన ఎన్ఎంయూ గుర్తింపు సంఘంగా ఏర్పడిందని చెప్పారు.  గత ప్రభుత్వం యూనియన్లను నిర్లక్ష్యం చేసిందని,  కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జిల్లా నాయకులు కత్తుల యాదయ్య, రుద్రోజు శేఖర్, చంద్రయ్య, నేతలు పాల్గొన్నారు.