
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినటమే మానేశారు.. సారీ.. సారీ కొనుక్కుని తినటం మానేశారు.. అదే ఫ్రీ అంటే.. బర్డ్ ఫ్లూ లేదూ.. తొక్కా లేదు.. ఎగబడి.. ఇరగబడి మరీ తినేశారు. అవును.. బర్డ్ ఫ్లూనా తొక్కనా అంటూ జనం వేలాదిగా తరలి వచ్చారు. ఫ్రీగా పెట్టిన చికెన్ కొరికి కొరికి తినేశారు. బిర్యానీని ఎంజాయ్ చేశారు. చికెన్ పీసులను నిమిలి నమిలి మింగేశారు. నిజం బర్డ్ ఫ్లూ ఉన్నా కూడా వీళ్ల దెబ్బకు అది చచ్చి ఉంటుంది అంటూ పబ్లిష్ సెటైర్లు వేసుకోవటం విశేషం.
ఏపీ రాష్ట్రంలోని గుంటూరు సిటీలో ఉన్న స్వామి ధియేటర్ గ్రౌండ్ లో ఫ్రీ చికెన్.. ఉచితం కోడికూర, ఉచితంగా బిర్యానీ అంటూ ఎనౌన్స్ చేశారు వ్యాపారులు. ఎంత మంది వచ్చినా బిర్యానీ పెడతాం.. ఎంత మంది అయినా రావొచ్చు.. అందరికీ బిర్యానీ ఉంది అంటూ ప్రకటించారు కొందరు వ్యాపారులు.
అంతే జనం ఎగబడ్డారు. వేలాది మంది స్వామి ధియేటర్ గ్రౌండ్ కు తరలి వచ్చారు. కోడి కూర, చికెన్ బిర్యానీని ఆరగించారు. జంట్స్ అని లేదు.. లేడీస్ అని లేదు.. అందరూ క్యూ కట్టారు. గంటల తరబడి క్యూలో ఉండి మరి చికెన్ బిర్యానీ తిన్నారు. ప్లేట్లు తీసుకుని బిర్యానీ కోసం ఎగబడటంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. అయినా పోలీసులు ఎక్కడా కనిపించలేదు. భద్రతను గాలికొదిసేశారు పోలీసులు అనే విమర్శలు ఉన్నాయి.
ఓ వైపు బర్డ్ ఫ్లూ ఉందని ప్రభుత్వమే చర్యలు చేపట్టింది. ఇలాంటి టైంలో వ్యాపారులు ఏర్పాటు చేసిన ఉచిత చికెన్ బిర్యానీ విందుకు ఎలా పర్మీషన్ ఇచ్చారు.. వాళ్లు తీసుకొచ్చిన కోళ్లు మంచివేనా.. బర్డ్ ఫ్లూ లేకుండా ఉన్నాయా అనేది కూడా ఎవరికీ తెలియదు.. గుంటూరు సిటీ నడిబొడ్డున ఇంత పెద్ద వ్యవహారం నడుస్తుంటే ప్రభుత్వ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడకపోవటం విశేషం.. విడ్డూరం..