ఈ నేచురల్ టిప్ పాటించండి.. మీ చుండ్రుకు వీడ్కోలు పలకండి

ఈ నేచురల్ టిప్ పాటించండి.. మీ చుండ్రుకు వీడ్కోలు పలకండి

డాండ్రఫ్.. ఇది అందరినీ పెట్టే సమస్య. చుండ్రు పోయినట్లే పోయి మళ్లీ మళ్లీ వస్తుంటది. ఇక చలికాలం వచ్చిందంటే అంతే సంగతులు. చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. ఉన్న నాలుగు వెంట్రుకలు కాస్త రాలిపోతుంటాయి. ఇదొక బాధైతే.. ఈ సమస్యతో నలుగురిలోకి పోవాలంటే చికాకు. చాలా మంది అన్ ఈజీగా ఫీలవుతుంటారు. ఇకనైనా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు చెప్పబోయే నేచురల్ టిప్ పాటించి చుండ్రు సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం..

గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్

చలికాలంలో చుండ్రు సమస్యకు సహజ పరిష్కారం గుడ్డు, పెరుగుతో చేసిన హెయిర్ మాస్క్. ఈ మాస్క్ స్కాల్ప్‌ను తేమ చేస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. గుడ్డు జుట్టుకు సహజమైన సూపర్ ఫుడ్. ఇందులో ప్రొటీన్, బయోటిన్, విటమిన్ ఎ, డి, ఇ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులోని ప్రొటీన్ జుట్టు మూలాలను బలపరిస్తే.. బయోటిన్ జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. విటమిన్ లు జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని ఇస్తాయి. ఇక పెరుగులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. దీనిని వారానికి ఓసారి అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటంతో పాటు మెరుస్తూ ఉంటుంది.

తయారు చేయు విధానం

  • ఒక గుడ్డు
  • ½ కప్పు తాజా పెరుగు
  • 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

మొదట గుడ్డును ఒక గిన్నెలో పగల కొట్టి పెట్టుకోండి. అందులో ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. మిశ్రమం స్మూత్ గా మారేంత వరకు కలపాలి. దాంతో, మీ హెయిర్ మాస్క్ రెడీ అయినట్టే.

అప్లై చేయు విధానం

మొదట జుట్టును కొద్దిగా తడి చేయండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న హెయిర్ మాస్క్ మిశ్రమాన్ని తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. వీలైతే జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీరు, షాంపూతో జుట్టును కడగాలి.

ఇలా వారానికోసారి హెయిర్ మాస్క్‌ని అప్లై చేయండి. రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు చుండ్రు రహితంగా మారడమే కాకుండా మెరుస్తూ బలంగా ఉంటుంది. మిశ్రమాన్ని సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేశాం కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.