పెండింగ్​ వేతనాలు చెల్లించాలి..నల్ల బ్యాడ్జీలు ధరించి ఈజీఎస్​ ఉద్యోగుల నిరసన

పెండింగ్​ వేతనాలు చెల్లించాలి..నల్ల బ్యాడ్జీలు ధరించి ఈజీఎస్​ ఉద్యోగుల నిరసన

మెదక్, వెలుగు : పెండింగ్​ వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్​డీఏ) లో పనిచేసే ఈజీఎస్​ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలలుగా తమకు వేతనాలు రావడం లేదన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు వెంటనే చెల్లించడంతోపాటు, ప్రతినెలా వేతనాలు రెగ్యులర్​గా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ రాజేందర్ రెడ్డి, అడిషనల్ డీఆర్పీ సంతోష్, జిల్లా ప్లాంటేషన్ సూపర్​ వైజర్  శ్రావణ్ కుమార్, పీవో శశిరేఖ, కంప్యూటర్ ఆపరేటర్లు ముజీబ్, శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.