జీతాలు రావడంలేదని ఈజీఎస్ సిబ్బంది ఆందోళన

శివ్వంపేట, వెలుగు: మూడు నెలలుగా జీతాలు రావడంలేదని ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) సిబ్బంది గురువారం ఆందోళనకు దిగారు. కుటుంబ పోషణ భారంగా ఉందని, పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో అనిల్, టెక్నికల్ ఇంజనీర్ సురేందర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, చారి, భాస్కర్, నర్సింలు, రవి పాల్గొన్నారు.