మార్కెట్‌‌‌‌లోకి రానున్న ఐషర్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్ ట్రక్‌‌‌‌

మార్కెట్‌‌‌‌లోకి రానున్న ఐషర్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్ ట్రక్‌‌‌‌

ఐషర్ మోటార్స్ చిన్న కమర్షియల్ వెహికల్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  వీఈ కమర్షియల్ వెహికల్స్‌‌‌‌ సబ్సిడరీ అయిన  ఐషర్ ట్రక్స్‌‌‌‌ అండ్ బస్సెస్‌‌‌‌ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌‌‌పోలో ‘ ఈవీ ఫస్ట్‌‌‌‌’ ట్రక్‌‌‌‌ను ప్రదర్శించింది. సిటీల్లో రవాణా కోసం ఈ ట్రక్‌‌‌‌ను తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది. ఈ ట్రక్‌‌‌‌ కెపాసిటీ 2 టన్నుల నుంచి 3.5 టన్నుల మధ్య ఉంటుంది. ఈ చిన్న కమర్షియల్ ట్రక్‌‌‌‌ను మొదట ఎలక్ట్రిక్ తర్వాత సీఎన్‌‌‌‌జీ, డీజిల్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.