మత సామరస్యానికి ప్రతీక ఈద్​మిలాబ్ : చెన్నూర్‌‌ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 

మత సామరస్యానికి ప్రతీక ఈద్​మిలాబ్ : చెన్నూర్‌‌ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 

చెన్నూర్‌‌, వెలుగు: ​మత సామరస్యానికి ఈద్​మిలాబ్ ప్రతీక అని చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. జమాత్​ఈ ఇస్లామీ హింద్​ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బంజారాహిల్స్​లోని ఖాజా మాన్సూన్​ కన్వెన్షన్​హాల్‌లో గురువారం రాత్రి నిర్వహించిన ఈద్​ మిలాబ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈద్​మిలాబ్‌ను రంజాన్‌కు ముగింపుగా నిర్వహిస్తారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన వివేక్​వెంకటస్వామి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.