Ramzan:రేపే(మార్చి31) రంజాన్..ఆదివారం కనిపించిన నెలవంక

Ramzan:రేపే(మార్చి31) రంజాన్..ఆదివారం కనిపించిన నెలవంక

తెలంగాణలో ముస్లింసోదరులు సోమవారం (మార్చి31)రంజాన్ జరుపుకోనున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలు,భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్‌ను సోమవారం జరుపుకోనున్నట్లు హైదరాబాద్‌లోని మర్కజీ రుయత్-ఎ-హిలాల్ కమిటీ ప్రకటించింది. ఈ పండుగ హిజ్రీ క్యాలెండర్ నెల షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు,ఉపవాస నెల అయిన రంజాన్ ముగింపును ఇది సూచిస్తుంది.

సోమవారం ఉదయం 10 గంటలకు ఈద్గా మీర్ ఆలం, ఉదయం 9గంటలరే ఈద్గా మొదటి లాన్సర్,ఉదయం 9.15గంటలకు ఈద్గా కుతుబ్ షాహీ ,ఉదయం 10గంటలకు ఈద్గా మాదన్నపేట్, ఉదయం 10గంటలకు మక్కా మసీదు, ఉదయం 10గంటలకు షాహి మసీద్,  ఉదయం 9.30గంటలకు  షాహి మసీద్ ,మస్జిద్ ఉస్మానియా, మలక్‌పేట్ (ఉదయం 9), మస్జిద్-ఎ-అజీజియా, మెహదీపట్నం (ఉదయం 6.45), మస్జిద్ హకీమ్ మీర్ వజీర్ అలీ (ఉదయం 7), సహీఫా మసీదు అజంపురా (ఉదయం 8.30)లో వంటి నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల నిర్వహించనున్నారు.