పట్టాలు తప్పిన అగర్తలా-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్

పట్టాలు తప్పిన అగర్తలా-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్

అస్సోం: అగర్తలా-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం నాడు (అక్టోబర్ 17, 2024) పట్టాలు తప్పింది. ఈ ట్రైన్ ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అస్సోంలోని దీమా హసావో జిల్లాలో ఈ ఘటన జరిగింది. దిబలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో సాయంత్రం 3:55 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే ప్రతినిధి తెలిపారు.

అగర్తలా నుంచి ఉదయం బయల్దేరిన ఈ రైలు 3:55 నిమిషాల సమయానికి దిబలాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో పవర్ కార్తో సహా రైలు ఇంజన్.. మొత్తం 8 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కారణంగా లుమ్డింగ్--బాదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 03674 263120, 03674 263126 హెల్ప్ లైన్ నంబర్లను ప్రొవైడ్ చేశారు. ఈ రైలు పట్టాలు తప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ | ఎక్కాలా వద్దా.. ఏంటీ టెన్షన్ : 72 గంటల్లో.. 20 విమానాలకు బాంబు బెదిరింపులు

గుజరాత్‌లో రైలు పట్టాలు తప్పించేందుకు దుండగులు ఇటీవల కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఇది భగ్నం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. గుజరాత్ వడోదర డివిజన్లో ఈ ఘటన జరిగింది. సూరత్ కిమ్ రైల్వే స్టేషన్ లో అప్ లైన్ రైల్వే ట్రాక్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్‌లోని ఫిష్‌ ప్లేట్‌, కీని తొలగించారు. వాటిని తిరిగి అదే రైలు పట్టాలపై  ఉంచారు. దీనిని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం కాసేపటికే ఫిష్ ప్లేట్లను తిరిగి బిగించారు. ఆ తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో దుండగులు పన్నిన కుట్ర విఫలమైంది.