స్కూల్‍కు పోయిన 8ఏళ్ల బాలుడు.. సలసల మసిలే నీటిలో పడ్డాడు

స్కూల్‍కు  పోయిన 8ఏళ్ల బాలుడు.. సలసల మసిలే నీటిలో పడ్డాడు

పాఠశాలకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు వేడి వేడి నీటిలో పడ్డ ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది. కేంద్రపాడు గ్రామంలోని అననత్ నారాయణ్ ప్రైపరీ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నా విద్యార్థి ఆహ్వాహాన్ నాయక్ సలసల మసిలే వేడి నీటిలో పడ్డాడు. గురువారం మధ్యాహ్నం భోజనం  చేయడానికి కొందరు విద్యార్థులతో కలిసి వంటగదికి వెళ్లిన ఆహ్వాహాన్  అన్నం వండటానికి పెట్టిన ఎసరులో పడ్డాడు. 

వెంటనే గమనించిని వంట మనిషి బిందులత బాలుడిని రక్షించింది. విద్యార్ధిని బహకాండియా  ప్రభుత్వ హాసిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆహ్వాహాన్  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అదృష్టశాత్తు బాలుడు చిన్నచిన్న కాలిన గాయాలతో బయటపడ్డాడు.