దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా ఫస్ట్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘ఏక్ ధమ్.. ఏక్ ధమ్’ అంటూ సాగే పాటను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ, నూపూర్ సనన్ రెట్రో లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. నుపుర్ చేతిలో పుస్తకాలు పట్టుకుని కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తుంటే, రవితేజ ఆమెను ఆటపట్టించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో రౌడీ గ్యాంగ్ కనిపిస్తున్న పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ALSO READ :లిక్కర్ అమ్మితే రూ.10 వేలు ఫైన్
ఇందులో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.