ఘట్కేసర్, వెలుగు: రాజకీయ నాయకుల పేరు చెప్పి తమ ప్లాట్లు కబ్జా చేస్తున్నారని 200 మంది ఏకశిలా నగర్ ప్లాట్స్ ఓనర్లు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వీరికి మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
పోచారం మున్సిపాలిటీ, కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్లు 739 నుంచి 749 వరకు ఉన్న 149 ఎకరాల్లో 1985లో ఏకశిలానగర్పేరుతో వెంచర్ వేశారని, 2007లో ఓ బిల్డర్తప్పుడు పత్రాలు సృష్టించి 47 ఎకరాల 25 గుంటల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు పొందాడని ప్లాట్ల ఓనర్లు తెలిపారు. ఓనర్స్ అసోసియేషన్మెంబర్స్ జుబేరే ఆక్రం, శివారెడ్డి, ఆమీర్ ఆక్రం పాల్గొన్నారు.