మహారాష్ట్ర తాత్కాలిక సీఎం, శివసేన నేత ఏక్ నాథ్ షిండే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కొన్ని రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఎంతకీ తగ్గకపోవటంతో.. 2024, డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం.. థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు డాక్టర్లు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. షిండే ఆస్పత్రిలో చేరారనే సమాచారంతో.. శివసేన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలి వస్తున్నారు.
మరో పక్క మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. సీఎంగా బీజేపీ నేతను ఎంపిక చేయడం దాదాపు ఖాయమేనన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ మేరకు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవర్ లు కూడా బీజేపీ పెద్దలకు ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. గురువారం ( డిసెంబర్ 5, 2024 ) ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. క్యాబినెట్ కూర్పు, శాఖల కేటాయింపు వంటి అంశాలపై కూటమి నేతల మధ్య ఇంకా క్లారిటీ రాకపోవటంతో డిసెంబర్ 5న కేవలం సీఎం, డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నారని తెలుస్తోంది.
ALSO READ : కేంద్రానికి రైతుల అల్టీమేటం.. ఢిల్లీ మార్చ్ వాయిదా
ఇదిలా ఉండగా.. గురువారం ( డిసెంబర్ 4, 2024 ) జరగాల్సిన శాసనసభాపక్ష సమావేశం కూడా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ సీఎం విజయ్ రూపానీల నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ నూతన సీఎం అభ్యర్థి ఎంపిక చేయాలని అధిష్టానం డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ లు సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా... షిండే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.