ఎన్నికల ఫలితాలను అంగీకరించండి..ప్రతిపక్షాలకు ఏక్​నాథ్ షిండే హితవు

ఎన్నికల ఫలితాలను అంగీకరించండి..ప్రతిపక్షాలకు ఏక్​నాథ్ షిండే హితవు

ముంబై: ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఖండించారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించాలని సూచించారు. ఆదివారం ముంబైలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘‘అభివృద్ధి పనులు చేపట్టడంతోనే అధికార మహాయుతి కూటమి ఎన్నికల్లో గెలిచింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఎన్నికల ఫలితాన్ని అంగీకరించాలి. సర్కారు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలి. 

ఎన్నికల్లో మీరు గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు.. లేకపోతే బాగా లేనట్టా. ఓడిపోయామని ఈవీఎలంపై ఆరోపణలు చేయడం సరికాదు. ఓటమిని అంగీకరించాల్సిందే. ప్రతిపక్షాల స్థానం ఏంటో ప్రజలు చూపించారు. ఇంట్లో కూర్చునే వారికీ ఓటు వేయబోమని నిరూపించారు” అని షిండే పేర్కొన్నారు.