ఏక్తాకపూర్కు టెలివిజన్ రంగంలో.. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్

ఫేమస్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్(Ektaa Kapoor) కి టీవీ ఇండస్ట్రీలో చేసిన కృషికి గాను అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లో 2023 నవంబర్ 20న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ ప్రదానోత్సవం వేడుకలు జరగనున్నాయి.

అంతర్జాతీయ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డును..ఏక్తా కపూర్ తీసుకుకోనున్నట్లు అకాడమీ అఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అధ్యక్షుడు, సిఈవో బ్రూస్ ఎల్. పేయిస్ నర్(Bruce L. Paisner) పేర్కోన్నారు. అంతే కాకుండా..ఏక్తా కపూర్ టెలివిజన్ పరిశ్రమలో.. మార్కెట్ లీడర్‌షిప్‌తో పాటు భారతదేశపు అగ్రశ్రేణి ఎంటర్‌టైన్‌మెంట్లో షోస్ నిర్మిస్తున్నారు. OTT ప్లాట్‌ఫారమ్‌తో ఇండియా వైడ్గా ఆడియన్స్ను సొంతం చేసుకున్నారు. ఏక్తా కపూర్ను ఈ డైరెక్టరేట్ అవార్డుతో సత్కరించడం మాకు ఎంతో గౌరవం అంటూ పేయిస్ నర్  తెలిపారు. 

ఏక్తా తనకు ఈ గుర్తింపు దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తూ..‘నా హృదయంలో ఈ అవార్డుకు ప్రత్యేక స్థానముంది.ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహన్నిస్తుంది. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్‌లో ఇదెంతో కీలకమైన అంశం. ఈ వేదికపై నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంతోపాటు గౌరవంగా ఉంది.

ALSO READ :అల్లు అర్జున్ డే టూర్ వీడియో.. ఓ రోజులో బన్నీ చేసే పనులు ఇవే

మహిళల కోసం డిఫరెంట్ స్టోరీస్ క్రియేట్ చేయడం కోసం టెలివిజన్ నాకొక సాధనం. వరల్డ్ వైడ్ గా ఉన్న లేడీస్,నా ఫ్రెండ్స్, కొలీగ్స్ నా పై చూపించిన ప్రేమకు ఈ అవార్డు దక్కడం ఎంతో హ్యాపీ. ఈ అవార్డు నాకు గుర్తింపు ఇవ్వనుంది.థాంక్స్ ఎమ్మీ’  అంటూ ట్విట్టర్ లో పేర్కొంటూ తన ఫీలింగ్ను షేర్ చేసుకుంది.

టెలివిజన్ రంగంలో ఎంతో ఫేమస్ గల ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఇంతటి గొప్ప అవార్డును సాధించిన ఏక్తాకపూర్కి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విషెష్ అందుతున్నాయి.