సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

 సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

జనగామ అర్బన్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​ కుమార్, రోహిత్​ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్​తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న స్టేషన్​ఘనపూర్​లో సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. 

హెలీప్యాడ్​ వద్ద అగ్నిమాపక యంత్రంతో సిబ్బంది, బ్యారికేడింగ్, అంబులెన్స్, ఆక్సిజన్​ సిలిండర్, మెడికల్​ సిబ్బంది, అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి వసతి, మూత్రశాలలు, మజ్జిగ ప్యాకెట్లు, ఏఎన్​ఎంలను నియమించాలన్నారు. ప్రారంభోత్సవాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తూ పూర్తిచేయాలని తెలిపారు. సమీక్షలో స్పెషల్​డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్​ నాయక్, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.