కష్టపడి సంపాదించిన రూ.12 కోట్లను గ్రామానికి విరాళంగా ఇచ్చేశారు

కష్టపడి సంపాదించిన రూ.12 కోట్లను గ్రామానికి విరాళంగా ఇచ్చేశారు

సాధారణంగా ఎవరైనా సరే సంపాదించడం ప్రారంభించినప్పుడు, సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి బదులుగా జీతం నుంచి పొదుపు చేయడం ప్రారంభించడం తెలివైన పనిగా పరిగణిస్తారు. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తూ ఉంటారు. అదేవిధంగా, చైనాకు చెందిన ఒక వృద్ధ దంపతులు తమ జీవితాంతం కష్టపడిన డబ్బును పొదుపు చేశారు. కానీ ఆ తర్వాత వారు చేసిన పని ఏంటో తెలిస్తే అది తప్పకుండా హృదయాన్ని హత్తుకుంటుంది.

చైనాలోని హుబేయ్‌కు చెందిన 90 ఏళ్ల మా జు, ఆమె భర్త యాన్ జుయాంగ్ తమ గ్రామం అభివృద్ధి కోసం దాదాపు రూ. 12 కోట్లను విరాళంగా అందించి వార్తల్లో నిలిచారు. చైనా మొదటి మహిళా పారాట్రూపర్లలో మా జు ఒకరు. ఈ ఉద్యోగంలో ఆమె మాజీ పారాట్రూపర్లలో ఒకరైన యాన్ జుయాంగ్‌ను కలుసుకుంది. మా జు ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబం నుంచి రాలేదు. ఆమె పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సైనికురాలిగా పనిచేసింది. ఆ తరువాత 1962లో పారాట్రూపర్‌గా మారింది. ఆమె ఎప్పుడూ దేశం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనే కోరికతో ఉండేది.

వివాహం తర్వాత, వారిద్దరూ సైన్యం కోసం శాస్త్రీయ పరిశోధనలకు తమ జీవితాలను అంకితం చేశారు. సైనికులకు రక్షణ కవర్లు, ఆక్సిజన్ జాకెట్లను తయారు చేసేవారు. అయినప్పటికీ, ఇద్దరూ డబ్బు ఆదా చేయడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. తమ కోసం చాలా తక్కువ ఖర్చు పెట్టేవారు. వాస్తవానికి, ఈ జంట దశాబ్దాలుగా కొత్త బట్టలు కూడా కొనుక్కోలేదు. శిథిలావస్థలో ఉన్న బంగ్లాలో నివసించే వారు.. ఓ పాత ఫోన్‌ను ఉపయోగించేవారు. వారు కేవలం 2డాలర్లు.. అంటే సుమారు రూ.160 విలువ చేసే బూట్లను ధరించేవారు.

ALSO READ : రిలేషన్స్ : దోస్తులతో ఇలా ఉంటే.. కలకాలం హ్యాపీగా ఉంటారు

ఒక రోజు ఈ జంట తమ గ్రామం అభివృద్ధి చెందడానికి, పిల్లలను చదివించడం వంటి సౌకర్యాలను అందించడానికి వారు కష్టపడి పొదుపు చేసిన మొత్తం రూ. 12 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పిల్లలను చదివించడం చాలా ముఖ్యమని, గ్రామం అభివృద్ధి చెందడానికి ఇది మరింత దోహదపడుతుందని వారు నమ్ముతారు.

2018లో ఒక రోజు వారు తమ డబ్బు, ఆస్తి మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని భావించారు. వారు ములాన్ కౌంటీకి చేరుకుని స్థానిక ప్రజలతో కూడా చర్చించారు. ఇదేదో స్కామ్ అని బ్యాంకు వాసులు కంగారుపడి పోలీసులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత.. భార్యాభర్తలిద్దరూ కలిసి చాలా డబ్బు ఆదా చేశారని, ఆ మొత్తాన్ని తమ కోసం ఖర్చు చేశారని పోలీసులు గుర్తించారు.  మా జు తన ఉద్యోగం నుంచి చాలా పెద్ద మొత్తంలో ఆదా చేసేది. పిల్లలు మంచి చదువులు చదివితే జీవితంలో విజయం సాధిస్తారని, వారితో పాటు ఊరు కూడా బాగుపడుతుందని వారి విశ్వాసం.