![సార్.. మా ఇద్దరు కొడుకులకు సర్కార్ కొలువులు.. అయినా మమ్మల్ని చూస్తలేరు.. వృద్ధ దంపతుల ఫిర్యాదు](https://static.v6velugu.com/uploads/2025/02/elderly-couple-complaint-to-ramagundam-cp-about-two-sons-who-are-govt-employees-but-not-taking-care-of-parents_c3wInDWh90.jpg)
- ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా.. సంరక్షణ పట్టించుకుంటలేరు
- రామగుండం సీపీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు
గోదావరిఖని, వెలుగు : “ సార్.. మాకు ఇద్దరు కొడుకులు నౌకర్లు.. పెద్దోడు ఆర్మీలో.. చిన్నోడు లైన్ మెన్ గా చేస్తున్రు. రూ. 10 లక్షల అప్పుజేసి మూడున్నర ఎకరాల భూమి కొనిచ్చాం.. అయినా మమ్మల్ని చూడడం లేదు’’.. అంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. గురువారం రామగుండం పోలీస్కమిషనర్శ్రీనివాస్కు కంప్లయింట్ చేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గుజ్జుల సాయిలు, చిలకమ్మ దంపతులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తమ సంరక్షణ పట్టించుకోవడంలేదని, ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆఫీసర్లు స్పందించి న్యాయం చేయాలని కోరారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుపై సీపీ స్పందించి.. చట్టప్రకారం న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేలా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, మెయింటనెన్స్ యాక్ట్ – 2007 చట్టం అమలులో ఉందని పేర్కొన్నారు.