ఆస్తులు పంచిస్తే ఇంటి నుంచి వెళ్లగొట్టారు..కలెక్టర్​కు వృద్ధ దంపతుల మొర

ఆస్తులు పంచిస్తే ఇంటి నుంచి వెళ్లగొట్టారు..కలెక్టర్​కు వృద్ధ దంపతుల మొర

జన్నారం, వెలుగు: కొడుకులకు ఆస్తులు పంచిస్తే వృద్ధాప్యంలో ఉన్న తమ బాగోగులు చూడకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అక్కపెల్లిగూడ గ్రామానికి చెందిన మెడిశెట్టి అమృత, లక్ష్మీరాజం దంపతులు కలెక్టర్  కుమార్  దీపక్  ముందు విలపించారు. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం కలెక్టర్​ జన్నారం వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వీరిద్దరు కలెక్టర్  వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమకు ఉన్న ఎకరం పొలాన్ని ఇద్దరు కొడుకులకు చెరి సగం పంచి ఇచ్చామని, ఇప్పుడు తమను ఇంటి వద్ద ఉంచుకోకుండా వెళ్లగొట్టారని బోరుమన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్  వారి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని అక్కడే ఉన్న ఆర్టీవో శ్రీనివాస్ ను ఆదేశించారు. ఆర్టీవో వారితో మాట్లాడి, న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.