ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో కోతుల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. శుక్రవారం గ్రామంలో వృద్ధుడు కుంచమటం కృష్ణమూర్తి ఇంటి వద్ద పనిచేసుకుంటుండగా కోతుల గుంపు మీద పడి దాడి చేసింది. దీంతో చేయి, వీపుపై గాయాలయ్యాయి. అతడిని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
కోతుల బెడదను నివారించాలని గ్రామస్తులు గ్రామపంచాయతీకి, మండల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కోతుల బెడద నివారించకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.