
కురవి, వెలుగు: నాటు కోళ్లు తమ ఇంట్లోకి వస్తున్నాయని ఓ వృద్ధుడిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రగయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూధనపల్లి గ్రామానికి చెందిన కొండ సోమయ్య అనే వృద్ధుడి కోళ్లు పక్కనే ఉన్న మేకల లింగన్న ఇంట్లోకి వస్తున్నాయని సోమవారం (ఫిబ్రవరి 3) రాత్రి గొడవపడ్డారు.
కొండ సోమయ్యకు చెందిన పిల్లల కోడిని చంపాడు. అనంతరం గొడ్డలితో అతని కాళ్లపై దాడి చేయడంతో ఓ కాలు విరగగా, మరో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి భార్య వెంకటమ్మ సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేశ్ తెలిపారు.