వికారాబాద్, వెలుగు: ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పేలడంతో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ భీమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ పట్టణంలోని గాంధీ కాలనీకి చెందిన కొల్లూరు సోమేశ (82) ముగ్గురు కుమార్తెల వివాహం చేశాడు. అతడి భార్య కళావతి రెండేండ్ల కింద చనిపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం రాత్రి 8 గంటల టైంలో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో అన్నం వండుతున్నాడు. ఈ క్రమంలో కుక్కర్ పేలడంతో సోమేశ్కు విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు, మృతుడి కూతుళ్లకు సమాచారం ఇచ్చారు. మృతుడి పెద్ద అల్లుడు అశోక్‌కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.