గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో వృద్ధుడి మృతి

గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో వృద్ధుడి మృతి

గంగాధర, వెలుగు: కరీంనగర్​ నుంచి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం -లింగంపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడు ఆదివారం గుండెపోటుతో చనిపోయాడు. పెగడపల్లి మండలం అయితుపల్లికి చెందిన ఆకుల గంగయ్య(75) కరీంనగర్​ వెళ్లాడు. గంగాధర మండలం మధురానగర్  దాటగానే వృద్ధుడికి గుండెపోటు రాగా, డ్రైవర్  సమీపంలోని పీహెచ్​సీకి తీసుకెళ్లారు. 108 సిబ్బంది వృద్ధుడిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.