పోలింగ్ బూత్ క్యూలోనే..ఎండదెబ్బతో ఓటరు మృతి

పోలింగ్ బూత్ క్యూలోనే..ఎండదెబ్బతో ఓటరు మృతి

ఉత్తరాది రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వీటితో పాటు హీట్ వేవ్ తీవ్రతతో ప్రజలు చనిపోతున్నారు. శనివారం (జూన్1) న యూపిలో ఏడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. ఓటువేసేందుకు బూత్ వద్ద క్యూలో నిలబడి ఓ వ్యక్తి వడదెబ్బతో కుప్పకూలిపోాయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రిపోర్ట్స్ ప్రకారం.. యూపిలోని పక్రి ప్రాంతంలో చక్ బహుద్దీన్ గ్రామంలో ఓ ప్రభుత్వ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఈ సంఘటన జరిగింది. మృతుడు 65 ఏళ్ల రామ్ బచన్ చౌహాన్ గా గుర్తించారు. రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని విపరీతమైన వేడిగాలులు వీయడంతో  రామ్ బచన్ చనిపోయారు. 

కాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ..రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అవసమైన చర్యలు చేపట్టాలని శుక్రవారమే మార్గదర్శకాలు జారీ చేశారు.  గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు, పశువులు, వన్యప్రాణుల భద్రత కోసం ప్రతి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.