గోదావరి బ్రిడ్జి కింద వృద్ధుడిని వదిలేసిన వ్యక్తులు

గోదావరి బ్రిడ్జి కింద వృద్ధుడిని వదిలేసిన వ్యక్తులు
  • మంచిర్యాల జిల్లా గూడెం బ్రిడ్జి కింద కదలలేని స్థితిలో కనిపించిన వృద్ధుడు
  • బంధువులకు అప్పగింత

దండేపల్లి, వెలుగు : జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఓ బ్రిడ్జి కింద అనాథగా వదిలేసి వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి బ్రిడ్జి కింద కదలలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని శనివారం స్థానికులు గుర్తించారు. అతడి వివరాల కోసం ప్రయత్నించగా తనది జైపూర్‌‌ మండలం ఇందారం గ్రామం అని, తన పేరు మార్నేని పోచయ్య అని, తనకు ఒక కొడుకు ఉన్నాడని చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్‌‌కిరణ్‌‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం మందమర్రిలో ఉంటున్న బంధువులకు వృద్ధుడిని అప్పగించారు.