బుద్దుందా రా : రీల్స్ చేస్తూ కుర్రోళ్ల ఎగతాళి.. ఆత్మహత్య చేసుకున్న బాబాజీ

బుద్దుందా రా : రీల్స్ చేస్తూ కుర్రోళ్ల ఎగతాళి.. ఆత్మహత్య చేసుకున్న బాబాజీ

అతని వయస్సు 70 ఏళ్లు.. ఇప్పటికీ కష్టపడి సంపాదించుకుంటున్నాడు.. గ్రామం గ్రామం తిరిగి చెత్త సేకరించటం.. వేస్ట్ ప్లాస్టిక్ సేకరిస్తూ పర్యావరణానికి తోడ్పడటమే కాకుండా.. జీవనోపాధి పొందుతున్నాడు.. అతన్ని అందరూ బాబాజీ అని ప్రేమగా పిలుచుకుంటారు.. రాజస్థాన్ రాష్ట్రం లోహావత్ గ్రామం చుట్టుపక్కల అందరికీ సుపరిచితులు ఈ ప్రతాప్ సింగ్ అలియాస్ బాబాజీ..

గ్రామంలోని కొందరు ఆకతాయి కుర్రోళ్లు.. అతనిపై రీల్స్ చేయటం మొదలుపెట్టారు.. బాబాజీ రిక్షా.. బాబాజీ వచ్చాడు చెత్త కోసం అంటూ వెటకారంగా.. ఎగతాళిగా రీల్స్ చేయటం మొదలుపెట్టారు.. క్రమ క్రమంగా ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.. పనీపాటా లేని కుర్రోళ్లు అందరూ సెల్ ఫోన్లు పట్టుకుని రీల్స్ కోసం ప్రతాప్ సింగ్ అలియాస్ బాబాజీ వెంట పడటం మొదలుపెట్టారు.

బాబాజీ వీడియోలు వైరల్ కావటం.. రోజు రోజుకు ఆకతాయి కుర్రోళ్ల రీల్స్ వెటకారాలు, ఎగతాళి ఎక్కువ కావటంతో.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బాబాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైపూర్ శివార్లలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టుకు బాబాజీ మృతదేహం వేలాడు కనిపించింది. స్థానికుల సమచారంతో పోలీసులు విచారణ చేయగా.. ఆకతాయి కుర్రోళ్ల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ఏదిఏమైనా 70 ఏళ్ల వయస్సులో కష్టపడి తన బతుకు తాను బతుకుతున్న ప్రతాప్ సింగ్ బాబాజీని చూసి నేర్చుకోవాల్సిన ఈ తరం కుర్రకారు.. ఇలా ఎగతాళిగా.. వెటకారంతో.. పనీపాట లేకుండా రీల్స్ పిచ్చితో చంపటాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు...