కూరగాయలు అమ్ముతూ అస్వస్థతతో వృద్ధురాలు మృతి

కూరగాయలు అమ్ముతూ అస్వస్థతతో వృద్ధురాలు మృతి

మంథని, వెలుగు : కూరగాయలు అమ్ముతూ అస్వస్థతకు గురై ఓ వృద్ధురాలు చనిపోయింది. జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన చిర్ల వెంకటమ్మ(65) కొన్నేళ్లుగా మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. 

ప్రతి రోజులాగానే  మంగళవారం కూరగాయలు అమ్ముతుండగా మధ్యాహ్నం సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సులో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.