గ్రేట్ గ్రాండ్​మా : వృద్ధాశ్రమంలో 95 ఏళ్ల బామ్మ.. అద్భుతమైన డాన్స్..

గ్రేట్ గ్రాండ్​మా : వృద్ధాశ్రమంలో 95 ఏళ్ల బామ్మ.. అద్భుతమైన డాన్స్..

సామాన్య ప్రజలు మొదలు.. సెలబ్రిటీలు.. వృద్దుల  వరకు  సినిమా డైలాగ్స్‌ని ఉపయోగించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడటానికి బక్క పలచగా ఉన్న ఆ వృద్ధురాలు.. తనదైన స్టైల్‌లో ఓ తమిళ పాటకు స్టెప్పులేసి సూపర్ అనిపించుకుంది. వయసు కేవలం సంఖ్యకు మాత్రమే, మనసుకు కాదని నిరూపించింది. ఆ వృద్ధురాలి డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆమె డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చూసిన నెటిజన్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయగా.. దానికి లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఆ బామ్మ డ్యాన్స్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

వృద్దాప్యంలో ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. అందరినీ నవ్విస్తూ.. తానూ నవ్వుతూ శేష జీవితం గడపడంలో ఉన్న సంతృప్తి మరొకదానికి ఉండదు. ఇక ఆశ్రమాల్లో ఉండే వారు తమ అనుభవాలను తోటి వారితో పంచుకుంటూ జీవితాన్ని గడుపుతారు.  అలానే చెన్నైలో ఓ వృద్దాశ్రమంలో 95 ఏళ్ల బామ్మ చలాకీగా.. ఉల్లసంగా.. ఉత్సాహంగా ఓ తమిళపాటకు డ్యాన్స్​ చేసిన వీడియో ఇంటర్​నెట్​ ను షేక్​ చేస్తుంది.    IRAS అనంత్ రూపనగుడి షేర్ చేసిన ఈ వీడియోలో వృద్ధ మహిళ ఓ రసిక్కుం సీమనే అనే తమిళ పాటకు డ్యాన్స్ చేశారు.

ఆ బామ్మగారి వివరాలు ఆరా తీయగా  1940 లలో కళాక్షేత్ర ఫౌండేషన్ విద్యార్థిని....  చంద్రలేఖ  వంటి చిత్రాలలో డ్యాన్స్ చేశారు. ఇప్పుడు 95 ఏళ్ల వయస్సులో చెన్నైలో ఒక కార్యక్రమంలో ఈ పాత తమిళ నంబర్ కోసం డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో  నెటిజన్లు స్పందించారు.  వాహ్​... @ 95 సంవత్సరాలు.. ఎంతో ఆరోగ్యంగా డ్యాన్స్​ చేశారని స్పందించగా.. మరొకరు ప్రతిభకు గుర్తింపు.. గౌరవం అవసరం  భవిష్యత్​ తరాలకు టీచర్​ గా  మార్గదర్శకంగా ఉన్నారని పోస్ట్​ చేశారు.  ఇంకొకరు మహిళ గొప్ప స్ఫూర్తిని ప్రశంసిస్తూ... ఆమె నృత్యం చేసిన తమిళ పాట గురించి వివరాలను పంచుకున్నారు.  ఈ వీడియో జూన్ 23న మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో  షేర్​ చేయగా ఇప్పటి వరకు 1.5 లక్షల  ( వార్త రాసే సమయానికి) వీక్షణలు పొందగా.. 5 వేలకు పైగా లైక్​ చేశారు.

చురుకుదనం, ఉత్సాహం, చేస్తున్న పని మీద శ్రద్ద చూస్తుంటే ఎవరికైనా ఆమెలో ఇంకా చాల విషయం ఉందనే అనిపిస్తుంది. తొమ్మిది పదుల వయసు దాటిన వృద్ధురాలు ఎలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ర సహకారం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉంటుంది. కాని ఆమె మాత్రం తగ్గేదేలే అంటోంది. నైంటీ  ప్లస్‌లో ఉన్నప్పటికి సెవంటీన్‌ ఈయర్స్‌ అమ్మాయి కూడా ఉండనంత చలాకీగా ఉంటుంది. ఒంట్లో ఎముకలే లేనట్లుగా కరెంట్ తీగలా ఎటుపడితే అటు మెలికలు తిరిగిపోతుంది. చెన్నైలోని ఓ వృద్ధాశ్రమంలో 95 సంవత్సరాల  వృద్ధురాలు ఓహ్ రసిక్కుం సీమనే అనే తమిళ పాటకు చక్కగా డ్యాన్స్ చేస్తున్న  బామ్మ టాలెంట్​ చూసి జనాలు ఆశ్చర్య పోతున్నారు.