పాము అనే మాట వినగానే భయపడతాం. ఎక్కడైనా పాము వెళ్ళిందని తెలిస్తే అటువైపు వెళ్ళను కూడా వెళ్ళం. ఈ మధ్య కాలం లో పాములు కారు బానెట్ లలోనూ, వాటర్ పైపులలోనూ, జనావాస ప్రాంతాల్లో తిరుగుతూ కాస్త భయపెడుతున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌కు చెందిన ఒక వృద్ధ మహిళ తన పొడవాటి దువ్వని జుట్టు (జటా) నాగుపామును పోలినందుకు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈవీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఆ మహిళ జుట్టు నాగుపాము ఆకారంలో ఉంది. ఆమె జుట్టులోనుంచి పాములు వచ్చాయా అన్న విధంగా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు హిందువులకు భక్తి భావాలు చాలా ఎక్కువుగా ఉంటాయి కదా.. ఇక అంతే జనాలు పువ్వులు వేసి పూజిస్తున్నారు. అంతేకాదు విరాళాలు వేసి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో meriyanunaji అనే ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో పొస్ట్ చేశారు. ఈ వీడియో ఆ వృద్ద మహిళ ఒక దేవాలం ఎదుట భిక్షాటన చేస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఆధ్యాత్మిక విషయాల ప్రకారం జుట్టు అత్యంత పవిత్రమైనదని రాశారు. మరొకొందరు ఇలాంటి దృశ్యాన్ని చూడటం తమ అదృష్టమన్నారు. చాలా మంది పాము అంటే శుభ్రమణ్యేశ్వర స్వామి అని ... ఒక వృద్ద మహిళ జుట్టు నాగుపాము ఆకారంలో ఉన్నందును ఆమె పాదాలకు నమస్కరించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.