తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు : భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు : భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుమల ఘాట్ రోడ్డులో స్వామి దర్శనానికి వెళుతున్న భక్తులను ఏనుగులు భయపెట్టాయి.   మొదటి ఘాట్‌ రోడ్డులోనిఏడవ మైలు సమీపంలో ఏనుగుల గుంపుగా సంచరించాయి.  సమీపంలోని అటవీప్రాంతం నుంచి ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకున్న ఏనుగుల గుంపు .... రోడ్డుకు పక్కనే ఉన్న చెట్లను విరిచి తిన్నాయి. ఘాట్‌రోడ్డుపై స్వామి దర్శనానికి వెళుతున్న భక్తులు  భయాందోళనకు గురయ్యారు.  భక్తులు  అటవీ అధికారులకు సమాచారం అందించడంతో.. ఏనుగుల మందను అటవీ ప్రాంతంలో పంపేందుకు ప్రయత్నించారు.