తెలుగు రాష్ట్రాల్లో మైకులు బంద్ : మద్యం షాపులు క్లోజ్

తెలుగు రాష్ట్రాల్లో మైకులు బంద్ : మద్యం షాపులు క్లోజ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ కూడా ఏప్రిల్ 11నే ప్రారంభం కానుంది.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2.97 కోట్ల మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1.49కోట్ల మంది. స్త్రీలు 1.47కోట్ల మంది. థర్డ్ జెండర్ ఓటర్లు 1504 ఉన్నారు.

మొత్తం  సర్వీస్ ఓటర్లు 11,320 మంది… ఎన్నారై ఓటర్లు 1731 మంది ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం 34వేల 604 పోలింగ్ కేంద్రాల్లో 79వేల 882 ఈవీఎంలు వాడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపులు బంద్

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) రజత్‌కుమార్.  11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపులు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుందన్నారు రజత్ కుమార్.

లిక్కర్, వైన్ షాప్ లు ఎల్లుండి పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ తెరుచుకోనున్నాయి.

నిజామాబాద్ లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్

నిజామాబాద్ పార్లమెంట్ కు మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 2 గంటల పాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దివ్యాంగుల కోసం ఈసారి కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.