6  గ్యారంటీలు పక్కా అమలు చేస్తాం : ఆవుల రాజిరెడ్డి

6  గ్యారంటీలు పక్కా అమలు చేస్తాం :  ఆవుల రాజిరెడ్డి

వెల్దుర్తి, చిలప్​చెడ్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారం చేపట్టగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తోందని కాంగ్రెస్​ నర్సాపూర్​అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శనివారం ఆయన వెల్దుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​పేదలందరికీ డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని మోసం చేసిందన్నారు. అర్హులైన వారికి ఇప్పటి వరకు తెల్లరేషన్​ కార్డులు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఆయన వెంట సుహాసిని రెడ్డి, నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, తలారి మల్లేశం, సుధాకర్ రెడ్డి, సీపీఐ నాయకులు ఉన్నారు.

బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్‌‌లోకి

చిలప్ చెడ్ మండలం అంతారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్​ సర్పంచ్  జక్కపల్లి అశోక్ గౌడ్, వార్డ్ మెంబర్లు చెన్నయ్య, పెంటమ్మ, లస్కర్, సోనీతో పాటు 100 గ్రామస్తులు కాంగ్రెస్​లో చేరారు. చిట్కుల్ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, యువ నాయకుడు నాన్ రెడ్డి వెంకట్ రెడ్డి, సర్వర్ మీర్జా, చిలప్ చెడ్ కు చెందిన 20 మంది కాంగ్రెస్‌‌లో జాయిన్​ అయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, చిలప్ చెడ్ మాజీ జడ్పీటీసీ చిలుముల శేష సాయి రెడ్డి, చిలప్ చెడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, విష్ణువర్ధన్ రెడ్డి, విఠల్ రెడ్డి, బాలకృష్ణ, సందీప్ గౌడ్, పుణ్య,  సునీల్, ఉపాధ్యక్షుడు పండరి పాల్గొన్నారు.