
దుబ్బాక, వెలుగు : దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సొంత నిధులతో గ్రామాల్లో హైమాస్ట్ లైట్లు వేశానని తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలకు రేషన్ బియ్యం లేక ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను అడ్డదారిలో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తీసుకపోయారని ఆరోపించారు. దుబ్బాకలో సిద్దిపేటల్లో పెత్తనం నడవనీయమని అన్నారు. తనను మరోసారి గెలిపిస్తే దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.