ఖమ్మం జిల్లాలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్పీచ్ తో విక్టరీ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజలనుంచి అపూర్వ స్పందన వచ్చింది.
‘మా మామ రాఘురామిరెడ్డి ఖమ్మం కాంగ్రస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగారు.. రఘురామిరెడ్డి ఏ పని టేకప్ చేసినా తప్పకుండా పూర్తి చేస్తారు..ఆయనను గెలిపిస్తే మీ సమస్యలను టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లి పరిష్కరిస్తారని నమ్మకుంది..రాఘురామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని’ ఆశ్రిత ఓటర్లను కోరారు. మే 7 న విక్టరీ వెంకటేస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు.