సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌ మెనిఫెస్టో

యాదాద్రి, వెలుగు : ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ మెనిఫెస్టో రూపొందించిందని భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, కర్నాటక ఎమ్మెల్సీ ప్రకాశ్ బాబన్న హుక్కెరి తెలిపారు.  శనివారం భువనగిరి నియోజకవర్గంలోని అనాజీపురం, నమాత్​పల్లి సహా వివిధ గ్రామాల్లో వారు  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కర్నాటకలో అధికారంలోకి రాగానే. ఇచ్చిన మాట ప్రకారం ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు వివరించారు.

తొమ్మిదేండ్ల బీఆర్​ఎస్​ పాలనతో యువతకు ఉద్యోగాలు రాలేవని వాపోయారు. కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన పనులనే తాము చేపట్టినట్టుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.  కాంగ్రెస్​ గెలిస్తేనే  యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పేదల సొంతింటి కల నెరవేరుతుందని చెప్పారు.

అధికారంలోకి రాగానే  ఆరు గ్యారెంటీ స్కీమ్‌‌లను  అమలు చేస్తామని మాటిచ్చారు. కాగా, బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌‌లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రచారంలో కాంగ్రెస్, సీపీఐ​ లీడర్లు తంగెళ్లపల్లి రవికుమార్​, ఏశాల అశోక్​ పాల్గొన్నారు.